సారాంశం

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.  ఈ దిన ఫలాలు 11.03.2025  మంగళవారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు

ఆప్తుల నుంచి ఆశించిన సాయం అందుతుంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు దక్కుతాయి. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది.

వృషభ రాశి ఫలాలు

దైవ దర్శనం చేసుకుంటారు. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ముఖ్యమైన సమాచారం అందుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి.

మిధున రాశి ఫలాలు

ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు తప్పవు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. పనుల్లో చిన్న చిన్న చిక్కులు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళంగా ఉంటుంది. కుటుంబంలో అదనపు బాధ్యతలు చికాకు తెప్పిస్తాయి.

కర్కాటక రాశి ఫలాలు

ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు వస్తాయి. పెద్దల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారంలో ఊహించని సమస్యలు వస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది.

సింహ రాశి ఫలాలు

అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. అన్ని పనులు టైంకి పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. శుభ కార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు.

కన్య రాశి ఫలాలు

ఉద్యోగులకు ఊహించని సమస్యలు వస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు వస్తాయి. కుటుంబంలో చికాకు వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు మూసుకుపోతాయి. విమర్శలు ఎక్కువవుతాయి.

తుల రాశి ఫలాలు

అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. వ్యాపారం అనుకూలం. నిరుద్యోగులకు కొంత అనుకూలం. ఉద్యోగంలో సమస్యలు అధిగమిస్తారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. విలువైన బహుమతులుగా పొందుతారు.

వృశ్చిక రాశి ఫలాలు

అవసరానికి చేతిలో డబ్బులు ఉండవు. వృత్తి, ఉద్యోగాల్లో నూతన  బాధ్యతలు చేపడతారు. రుణ ప్రయత్నాలు కలసిరావు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఇంట్లో కొందరి ప్రవర్తన తలనొప్పి తెప్పిస్తుంది.

ధనస్సు రాశి ఫలాలు

ఆర్థికంగా అనుకూలం. దైవదర్శనం చేసుకుంటారు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు బాగుంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మకర రాశి ఫలాలు

ఆప్తులు నుంచి ఆర్థిక సాయం అందుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. ఉద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.

కుంభ రాశి ఫలాలు

ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు వస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల కోపానికి గురికావాల్సి వస్తుంది. ఆస్తి వివాదాలు చికాకు తెప్పిస్తాయి.

మీన రాశి ఫలాలు

ఉద్యోగులకు విశ్రాంతి ఉండదు. పనుల్లో అవాంతరాలు ఎక్కువ. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది  వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి  ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.