Asianet News TeluguAsianet News Telugu

జ్యోతిష్యం.. ఏమిటి ఈ యాత్ర రేఖలు?

యాత్రలను గురించి తెలుసుకోవడానికి సాముద్రికశాస్త్రం ప్రకారం చరగ్రహాలైన చంద్ర, శుక్ర మరియు బుధుడిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి కాని మిగతా గ్రహాలలో వచ్చు రేఖలు యాత్రలను గురించి తెలియజేయవని కావు.

astrology.. what is yatra rekhalu?
Author
Hyderabad, First Published Sep 5, 2018, 4:01 PM IST

యాత్రారేఖల యొక్క అర్థాన్నిబ్టి చూస్తే ఒక చోటి కి వెళ్ళడం, క్షేత్ర, తీర్థ ద్శనాలు చేసుకోవడం వింవి సాధారణంగా దృష్టిలోకి వస్తాయి. యాత్రలను గురించి తెలుసుకోవడానికి సాముద్రికశాస్త్రం ప్రకారం చరగ్రహాలైన చంద్ర, శుక్ర మరియు బుధుడిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి కాని మిగతా గ్రహాలలో వచ్చు రేఖలు యాత్రలను గురించి తెలియజేయవని కావు. కాని చరగ్రహాలైన స్థానాలైన గ్రహ క్షేత్రాల నుండి బయలుదేరి వేరువేరు గ్రహ క్షేత్రాలకు వెళ్ళు రేఖలు కూడా యాత్రా రేఖలని భావిస్తారు.

సాధారణంగా చంద్రస్థానంలో చిన్న పెద్ద జీవితరేఖవరకు వెళ్లి తాకునటువిం అడ్డు రేఖలు యాత్రా రేఖలుగా పరిగణింపబడినవి. ముఖ్యంగా ఇవి మధ్యభాగంలో ఉండునవి మాత్రమే యాత్రారేఖలని విశేషించి చెపుతారు.

ఒకవేళ శుక్రస్థానంలో బయలుదేరిన రేఖ లేదా మణికట్టునుండి వచ్చు రేఖలు, చంద్రస్థానంలోకి 50% అడ్డుగా వచ్చు రేఖలు కూడా యాత్రారేఖలుగా పరిగణింప బడతాయి. ఇటువిం రేఖలు బుధస్థానానికి కూడా వర్తింపబడతాయి. వేరువేరు రేఖల నుండి లేదా వేరువేరు గ్రహాల నుండి లేదా ఆ వైపు అడ్డుగా వెళ్ళు రేఖల నుండి ఒక రేఖ వచ్చి చంద్రస్థానానికి వెళ్ళిన అది కూడా యాత్రారేఖ అవుతుంది. ఫలితాలు గ్రహాలనుబ్టి రేఖలను బ్టి చెప్పవలసి ఉంటుంది. మొత్తానికి రేఖలు ఏ రేఖపై ప్టుటి న చంద్రస్థానం సగభాగం వరకు ఉంటేనే అవి యాత్రారేఖలుగా పరిగణింప బడతాయి.

చంద్రస్థానంలో అరచేతిలో రంగు మారిన చర్మంలో (ముంజేయికి వేరురంగులో) చాలా చిన్న అడ్డురేఖ ప్రవేశించిన అది యాత్రాకాంక్షరేఖ అవుతుంది. కాని యాత్రకు వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉంటాయి యి.

అక్కడే కొద్దిగా మాత్రమే పెద్దదైన రేఖ ఉన్న చిన్న చిన్న యాత్రలు చేసే అవకాశం ఉంటుంది. మరికొంత వరకు పెరిగి 30% వరకు అడ్డురేఖ యాత్రా రేఖగా కనబడిన దేశంలోని వేరువేరు ప్రాంతాలలో దూరదూరమైన తీర్థాలను, క్షేత్రాలను దర్శించుకొను ఫలితమిస్తుంది.

ఒకవేళ ఈ రేఖ చంద్రస్థానంలో అడ్డురేఖగా 50% దాటి న అది విదేశీ రేఖగ పరిగణిస్తారు. ఇదే రేఖ ఒకవేళ జీవితరేఖను తాకిన విదేశాల్లోనే జీవితం గడుపు వ్యక్తి కాగలరు.

కంకణ రేఖలనుండి లేదా మణికట్టు చివరినుండి కొద్ది పొడవైన రేఖలు నిలువున చంద్రస్థానంలోకి నాలుగు ఐదు వరకున్న కూడా అవి విదేశాలకు వెళ్ళి వచ్చే యోగాలను తెలుపుతుంది.

అలాగే జీవితరేఖపై ఒక క్రమంలో ఊర్ధ్వరేఖలుగా వరుసగా నాలుగైదు రేఖలు కనబడిన అవి కూడా విదేశీ రేఖలుగా పరిగణింపబడతాయి. (ఇవి ఆయా వయస్సులలో ప్రగతిని కూడా సూచిస్తాయి)

కొంతకాలం క్రితం చంద్రస్థానంలో వచ్చు అడ్డు రేఖలను సముద్రయానమని కూడా వ్యవహరించారు. కాలానుగుణంగా ప్రయాణ వాహన సౌకర్యాలు పెరిగినందున వేరువేరు వాహనాలలో విదేశాలకు వెళ్ళు రేఖలుగా ప్రస్తుత కాలంలో భావిస్తున్నారు.

ఒక ధృడ సంకల్పం ఉన్నచో ప్రయత్నపూర్వకంగా అదే పనిగా విదేశాలకు వెళ్ళవలెనను సంకల్పం ఉన్న చంద్ర స్థానంలో రేఖలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

 

డా|| ఎస్‌. ప్రతిభ.

మరిన్ని వార్తలు చదవండి

మీ చేతిలో ధన రేఖ ఉందా..?

Follow Us:
Download App:
  • android
  • ios