చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో సంచరింటాచే సమయం కాబట్టి ఇది ఆషాఢమాసం అయింది. ఈ మాసంలో శుభ కార్యాలకు అంతగా అవకాశం ఉండదు. కాని ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మాసం ఈ ఆషాఢ మాసం.

తెలంగాణలో బోనాల పండుగ, జగన్నాథుని రథయాత్ర, చాతుర్మాస వ్రత దీక్షారంభాలు.... ఇలా ఎన్నో ఎన్నెన్నో స్థానిక  పండుగలతో వాతావరణం అంతా సందడి సందడిగా సాగుతుంది.

రవి కర్కాటక రాశి నుంచి మకరరాశికి ప్రవేశించడంతో దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఈ కాలాన్ని దక్షిణాయనంగా పేర్కొటాంరు. ఈ అయనంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణ దిశగా సంచరిస్తాడు. ఈ దక్షిణాయనం పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనది.

ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచే మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వాములు, గృహస్థులు అందరూ చాతుర్మాసవ్రత ఆచరణ ప్రారంభిస్తారు. దీనికి ప్రకృతికి దగ్గరి సంబంధం ఉంటుంది. నిన్నివరకు ఎండలు బాగా ఉండి ఏ ఆహారాన్ని తీసుకున్నా తొందరగా జీర్ణం అవుతూ ఉంటుంది. శరీరంలో జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఈ ఆషాఢ మాసం నుంచి వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. వర్షాలు పడతాయి. తరువాత చలికాలం వస్తుంది. అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోకూడదు అని సూచన చేయడానికి  పూర్వం నుంచి కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. ప్రస్తుతం ఆషాఢం నుంచి గణపతి చవితి వరకు ఆకు కూరలు తిన కూడదు. వర్షాలు ఆకులపై చెట్లపై పురుగు, పూచి ఉంటాయనే ఉద్దేశంతో ఈ నియమం ఏర్పరచ పడింది.

ఆషాఢ మాసం వస్తే చాలు ఆడవారి అర చేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది. గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గోరింటాకు రసంలో యాంటీ  బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటిద్వారా క్రిములు వెళ్ళకుండా కాపాడుతుందని చెబుతుటాంరు. అంతే కాదు గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది.

ఆషాఢం అనారోగ్యాలకు నెలవైన మాసంగా కూడా పిలుస్తారు. విపరీతమైన ఈదురు గాలులలో చినుకులు పడే సమయ మిది. కాలువలు, నదుల్లో ప్రవహించే నీరు అపరిశుభ్రంగా ఉంటుంది. చెరువులోకి వచ్చే నీరు మలినంగా ఉండి మనుషులు అనారోగ్యానికి కారణం అవుతుంది. కొత్త నీరు తాగడం, వర్షంలో తడవడం వల్ల చలి జ్వరం, విరేచనాలు, తలనొప్పి మొదలైన వ్యాధులు వచ్చే సూచనలు కనబడతాయి.

గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన మాసం. శుభకార్యాలకు సెలవు. దీన్ని శూన్య మాసంగా పిలుస్తారు. ఋతువులు ఈ మాసంతోనే ప్రారంభం అవుతాయి. కాబట్టి ఇది శూన్యమాసంగా చెపుతారు. ఈ ఆషాఢ మాసం నియమ నిష్ఠలకు ప్రత్యేకమైన మాసం. స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు. కావున గోరింటాకు పెట్టుకోవడం తప్పనిసరి. ఆ గోరింటాకు వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి. శరీరంలో అనారోగ్యం వ్యాపింప చేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది. ఏవైనా మానని గాయలకు కూడా గోరింటాకును రుబ్బి అది మందుగా పెడతారు. ప్రస్తుత కాలంలో వచ్చే   కోన్‌లు, నేల్‌ పాలీషులు పనికిరావు. పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ వాతావరణానికి కాలానికి తగినట్టుగా ఉండేవి. వాటిని ప్రస్తుత కాలం వారికి తెలియక మూఢ నమ్మకం అని కొట్టి పారేస్తున్నారు. కాని ప్రతీ దాంట్లో కూడా ఒక సింటిఫిక్ రీజన్‌ మనకు కనిపిస్తుంది. ఆలోచిస్తే..

ఈ మాసంలో దీక్షలు, వ్రతాలు ఆచరణ చేయడం. కామితార్థాలను పక్కన పెట్టి మోక్షార్థాలకోసం ప్రయత్నం చేసే మాసం. శరీరాన్ని మనస్సును ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకోవడానికి అనువైన మాసం ఆషాఢమాసం. కాబట్టే ఈ మాసంలో బోనాలు, జాతరలు మొదలైనవి, వేప ఆకులు, పసుపు పెట్టుకోవడాలు, వ్రతాలు మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. వాటిని అందరూ ఆచరింటాచి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ...... శ్రీ మాత్రేనమః.