1.పూర్ణ చందరావు

జాతకం చెప్పండి

ప్రస్తుతం కొంత ఒత్తిడి అధికార ధోరణి ఉంటుంది. తర్వాత ఏప్రియల్‌ 2019 నుంచి ఒక సంవత్సరం పాటు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఏ పని చేయాలన్నా నాకు చేతకాదు, వీలుకాదు లాటి  పదాలు ఉపయోగించకుండా జాగ్రత్త పడండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. మిమల్ని మీరు తక్కువగా చూసుకోకూడదు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. జాగ్రత్త వహించాలి. ఏ పని చేసినా ఒకరి సలహా తీసుకుని మాత్రమే పని మొదలు పెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

శ్రమకు తగిన ఫలితం రాదు. కావున నిరంతరం దానం చేస్తూ ఉండాలి.

జపం : శ్రీ దత్త శ్శరణం మమ,

దానం : అన్నదానం,/ పాలు / పెరుగు, 2. పళ్ళు/ విద్యార్థులకు పుస్తకాలు దానం చేయాలి.

2, భాస్కర రెడ్డి

వివాహం ఎప్పుడు అవుతుంది?

మీకు జాతకంలో ఆలస్య వివాహం సూచిస్తుంది. కావున తొందరపడవద్దు. 2021 ఆగస్టు తర్వాత వివాహానికి అనుకూల సమయం. అప్పుడు ప్రయత్నాలు మొదలు పెడితే తొందరగా కుదురుతుంది. మీరు స్వతహాగా కొంత బద్ధకస్తులు. దానిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

ప్రస్తుతం ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చినా అందులో జాయిన్‌ అవ్వండి. ల్‌ే చేయవద్దు. వివాహం ఉద్యోగంలో స్థిరత్వం అన్నీ కూడా 2021 తర్వాతనే ఉంటాయి.

దానం : అన్నదానం/ పాలు/ పెరుగు 2. కందిపప్పు/ దానిమ్మపళ్ళు / ఖర్జూరాలు , 3. ఇడ్లీ/ వడ, 4. పళ్ళు/ విద్యార్థులకు పుస్తకాలు, 5. నిమ్మకాయ పులిహోర దానం చేయాలి.

జపం : మంగళం భగవాన్‌ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, మంగళాయతనం హరిః జపం నిరంతరం చేసుకోవాలి.

3. అశోక్‌

వివాహం ఎప్పుడు అవుతుంది?

ప్రస్తుతం మీకు వివాహానికి అనుకూల సమయం ఉంది. మీరు ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. వివాహం కోసం వచ్చే జాతకాలు జాగ్రత్తగా చూసి ఎంచుకోండి. ప్రస్తుతం ఉద్యోగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఒక రెండు సంవత్సరాల తర్వాత ఉద్యోగంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. చేసే మంచి పనులు పెంచుకుంటూ ఉంటే ఏ రకమైన లోపాలు లేకుండా ఉంటాయి. జాతకం అన్ని విధాలా బావుంది.

జపం : కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే, శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.

దానం : పళ్ళు /విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి.

4. లలిత లక్ష్మణ్‌

ప్రమోషన్‌ ఎప్పుడు వస్తుంది.

ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది. మీరు కష్టపడిన దానికంటే మీకు వచ్చే ఆదాయం ఎక్కువే ఉంటుంది. మీకు అది సరిపోవటం లేదని ఆలోచన కూడా చాలా ఉంటుంది. కాని మీరు దానం చేయడం తక్కువగా ఉంటుంది. దానాలు పెంచుకుంటే మీ జాతకం అనుకూలంగా ఉంటుంది.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః; శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

దానం: అన్నదానం / పాలు/ పెరుగు 2. ఇడ్లీ / వడ దానం చేయాలి.

5. శ్రీనివాస రెడ్డి?

వివాహం ఎప్పుడు వివాహం అవుతుంది?

మీ జాతకంలో ఆలస్యం వివాహం సూచిస్తుంది. ఇప్పుడు మీరు ప్రయత్నాలు చేయండి. ఆగస్టు తర్వాత మీకు వివాహానికి అనుకూలంగా ఉంటుంది. ఒక చిన్న సలహా మీరు ఎదుటి వారితో మ్లాడేటప్పుడు ఆచి,తూచి వ్యవహరించాలి. తొందరపాటు పనికిరాదు.

జపం : కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే, శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దాన : అన్నదానం / పాలు / పెరుగు అధికంగా దానం చేయాలి?

6.జయ కుమార్‌

ప్రేమ వివాహం అవుతుందా?

మీ జాతకంలో ఆలస్య వివాహం సూచిస్తుంది. మీకు ఇష్టమైనవివాహం జాతకంలో కనిపించడం లేదు. మీరు ఏదైనా ఉద్యోగంలో ప్రస్తుతం జాయిన్‌ అవ్వండి. నవంబర్‌ లోపు సమయం అనుకూలంగా ఉన్నది.  డైరెక్ట్‌ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కొంచెం కష్టంగానే ఉంటుంది. రెండవ స్థాయి ఉద్యోగాలకు ప్రయత్నం చేయండి. తప్పకుండా వస్తాయి.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః జపం మంచిది.

దానం : కందిపప్పు/ దానిమ్మపళ్ళు/ కర్జూరాలు/ 2. పశుపక్షాదులకు ఆహారం తప్పనిసరిగా చేయాలి.

7. విజయ్ పాలకూరి భవిష్యత్తు చెప్పండి

మీకు ఏప్రిల్‌ 2020 తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం అవసరం లేని ఒత్తిడి అంతా మీకు ఉంటుంది. మీ సమయం, శ్రమ, ధనం అన్నీ వృథా అవుతాయి.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

దానం : పశుపక్షాదులకు ఆహారం / నీరు, 2. పల్లీలు/ నూనె, 3. కూరగాయలు/ ఆకుకూరలు/ ఆకుపచ్చరంగు వస్త్రాలు, 4. గోధుమపిండి/ గోధుమరవ్వ/ పళ్ళు దానం చేయండం మంచిది.

మీకు ఎంత ఎక్కువ దానాలు చేస్తే అంత అధిక ఫలితం ఉంటుంది. మీరు ఎదుటి వారిని గౌరవించడం అలవాటు చేసుకోవాలి. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టరాదు.

డా.ఎస్.ప్రతిభ