ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఉద్యోగస్తులలో నిరాశ, నిస్పృహలు ఉంటాయి. అనవసర ఖర్చులు చేస్తారు. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారులతో అప్రమత్తత అవసరం. సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అనవసర ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్యం సూచితం. శ్రీ విష్ణుసహస్రనామ పారాయణ శుభ ఫలితాలనిస్తుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విద్యార్థులకు ఒత్తిడి సమయం. పరిశోధకులు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. చేసే అన్ని పనులలో వ్యతిరేకతలు చూసే వారు అధికం అవుతారు. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనే తపన ఉంటుంది. గౌరవం తగ్గే సూచనలు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనవసర ఖర్చులు ఉంటాయి. చెడు స్నేహాలు అలవాటు అయ్యే సూచనలు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి. అవమానాలు. బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళడం. పరామర్శలు ఉంటాయి. విద్యార్థులకు ఎక్కువ శ్రమ తక్కువ ఫలితాలు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుబంధాలు ఒత్తిడిని కలిగిస్తాయి. పరస్పర సహకారం కోసం ఎదురు చూపులు ఉంటాయి. ఒత్తిడితో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సౌకర్యాలు వచ్చినా వాటి వల్ల సంతోషం ఉండదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆహారంలో సమయపాలన మంచిది. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. ఋణసంబంధ ఆలోచనల్లో కాస్త ఉపశమనం దొరుకుతుంది. శత్రువులపై విజయానికి సాధన చేస్తారు. సౌకర్యాలు కొంత సంతృప్తినిస్తాయి. ప్రయాణాల్లో అనుకూలత లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సంతానం వల్ల సమస్యలు ఉంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. కార్యసాధనలో పట్టుదల తప్పనిసరి. అనవసర ఖర్చులు వచ్చే సూచనలు. ఆభరణాలు, ఆస్తులపై దృష్టి పెడతారు. వాక్ చాతుర్యం తగ్గుతుంది. మధ్యవర్తిత్వాలు పనికిరావు. శ్రీ దత్త శ్శరణం మమ.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌఖ్యలోపం ఉంటుంది. ఆహారంలో సమయ పాలన అవసరం. విద్యార్థులకు ఒత్తిడి ఉంటుంది. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఉంటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కార్యసాధనలో పట్టుదల ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సహకారంలభిస్తుంది. కొంత, సమయం, కాలం, ధనం వృథా అవుతాయి. చేసే పనుల్లో ఉత్సాహం లభిస్తుంది. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. విశ్రాంతి దొరుకుతుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాగ్దానాలు ఒత్తిడిని కలిగిస్తాయి. మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆర్థిక నిల్వలు కోల్పోయే సూచనలు. అనవసర ఒత్తిడి ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పనుల్లో సంతృప్తి ఏర్పడుతుంది. అత్యవసర నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో పట్టుదల అవసరం. శ్రమ, కాలం, ధనం వృథా అవుతాయి. జాగ్రత్త పడడం మంచిది. శ్రమానంతరం ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు కొంత ఒత్తిడి కొంత అనుకూల సమయం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతికోసం ఆలోచన చేస్తారు. విశ్రాంతి లభిస్తుంది. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. సహోద్యోగులతో జాగ్రత్త అవసరం. పాదాల నొప్పులు ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రలపై ఆలోచన ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. సమిష్టి ఆదాయాలు ఉంటాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ప్రతిపని లాభాపేక్షతో ఉంటుంది. శ్రమలేని ఆదాయం వస్తుంది. విహార యాత్రలు చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
డా.ఎస్.ప్రతిభ
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 27, 2018, 9:49 AM IST