Asianet News TeluguAsianet News Telugu

1 నవంబర్ 2018 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

1st nov2018 your horoscope
Author
Hyderabad, First Published Nov 1, 2018, 9:27 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఊహించని లాభాలు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తెలియని ఆదాయాలు వచ్చే సూచనలు ఉంటాయి. ఆరోగ్యంపై దృష్టి పెడతారు. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. పరాధీనం ఉంటుంది. సంతృప్తి లభిస్తుంది. లక్ష్మీహృదయ స్తోత్ర పారాయణ శుభ ఫలితాలనిస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : నూతన పరిచయాల వల్ల అనుకూలత పెరుగుతుంది. భాగస్వామ్య ఒప్పందాలు నెరవేరుతాయి. సామాజిక అభివృద్ధి బావుంటుంది. సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు. పనుల్లో నూతనోత్సాహం ఉంటుంది. పనుల్లో అభివృద్ధి ఉంటుంది. లక్ష్మీహృదయ స్తోత్ర పారాయణ శుభ ఫలితాలనిస్తుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పనుల్లో ఆటంకాలు తగ్గుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. పోటీల్లో గెలుపు సాధిస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. ఋణ సంబంధ ఆలోచనలు తగ్గుతాయి. లక్ష్మీహృదయ స్తోత్ర పారాయణ శుభ ఫలితాలనిస్తుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానం వల్ల సంతోషం తగ్గుతుంది. విద్యార్థులకు అధిక శ్రమ అవసరం. పనుల్లోఆటంకాలు ఉంటాయి. చిత్త చాంచల్యం పెరుగుతుంది. సృజనాత్మకత లోపిస్తుంది. కళాకారులు జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మీహృదయ స్తోత్ర పారాయణ శుభ ఫలితాలనిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విహార యాత్రలపై దృష్టి పెరుగుతుంది. విహార యాత్రల వల్ల సంతోషం లభిస్తుంది. ప్రయాణాల్లో అనుకూలతలు ఉంటాయి. మృష్టాన్న భోజనంపై దృష్టి ఉంటుంది. సౌకర్యాల వల్ల సంతోషం పెరుగుతుంది. సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నం అధికం చేస్తారు. లక్ష్మీహృదయ స్తోత్ర పారాయణ శుభ ఫలితాలనిస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సహకారం వల్ల ఒత్తిడి లభిస్తుంది. పనులలో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారస్తులకు అప్రమత్తత అవసరం. పనులలో సమయ పాలన పాటిఉంచాలి. తోటివారితో జాగ్రత్తగా మెలగాలి.  కమ్యూనికేషన్స్‌ వల్ల ఆటంకాలు వచ్చే సూచనలు ఉంటాయి. లక్ష్మీహృదయ స్తోత్ర పారాయణ శుభ ఫలితాలనిస్తుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : నిల్వ ధనం పెంచుకుటాఉంరు. ఆభరణాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వాగ్దానాల నెరవేరుతాయి. మాట విలువ పెరుగుతుంది. కుటుంబంలో గౌరవం, సంతోషం వృద్ధి చెందుతాయి. లక్ష్మీహృదయ స్తోత్ర పారాయణ శుభ ఫలితాలనిస్తుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శారీరక శ్రమ ఉంటుంది. పనుల్లో చికుకాలు అధికంగా ఉంటాయి. ఒత్తిడితో పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికల మార్పు అవసరం. గుర్తింపు అంతగా లభించదు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త అవసరం. లక్ష్మీహృదయ స్తోత్ర పారాయణ శుభ ఫలితాలనిస్తుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విశ్రాంతిలోపం ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.  ఇతరులపై ఆధారపడతారు. సుఖంకోసం ఆలోచన పెరుగుతుంది. శత్రువుల వల్ల ఒత్తిడి అధికం అవుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ఒత్తిడితో పనులు పూర్తిచేస్తారు. లక్ష్మీహృదయ స్తోత్ర పారాయణ శుభ ఫలితాలనిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం. సమిష్టి ఆదాయాలు ఉంటాయి. వ్యాపారస్తులు అధిక సంతోషంతో ఉంటారు. ఆదర్శవంతమైన జీవితం గడపాలనే కోరిక ఉంటుంది. సంతృప్తి లభిస్తుంది. లక్ష్మీహృదయ స్తోత్ర పారాయణ శుభ ఫలితాలనిస్తుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారస్తులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. లక్ష్మీహృదయ స్తోత్ర పారాయణ శుభ ఫలితాలనిస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విద్యార్థులకు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో ఆటంకాలు అధికంగా ఉంటాయి. పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించాలి.  విదేశీ వ్యవహారాలపై దృష్టి తగ్గించేటట్లు ఉండాలి. లక్ష్మీహృదయ స్తోత్ర పారాయణ శుభ ఫలితాలనిస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios