వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం చేపట్టడానికి వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా ఆయన ఇండియాటుడే 18వ ఎడిషన్ కాంక్లేవ్ లో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ తో ముచ్చటించారు
వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం చేపట్టడానికి వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా ఆయన ఇండియాటుడే 18వ ఎడిషన్ కాంక్లేవ్ లో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా జగన్.. తాను ముఖ్యమంత్రి అయితే.. రాష్ట్రానికి ఏం చేస్తారు..? జాతీయ రాజకీయాల్లో తన వైఖరి, అదేవిధంగా ఏపీకి శత్రువులు ఎవరూ లాంటి విషయాలను జగన్ ప్రస్తావించారు.
జాతీయ రాజకీయాలకు సంబంధించినంతవరకు రెండు పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, అందుకే జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతానికి తటస్థ వైఖరిని అవలంబిస్తున్నామని జగన్ ఈ సందర్భంగా చెప్పారు. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు.
అనంతరం తాను ముఖ్యమంత్రి అయితే.. రాష్ట్రానికి ఏం చేస్తారో కూడా వివరించారు. చంద్రబాబు పరిపాలనలో ఎన్నో అవకతవకలు జరిగాయని జగన్ చెప్పారు. ఓ వర్గం వారికి మాత్రమే చంద్రబాబు ప్రయోజనం కల్పించారని ఆరోపించారు.
తమకు ఓటేసిన వారికే ప్రభుత్వ పథకాలు అంటూ వివక్ష చూపించారన్నారు. కానీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తామన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి.. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేవిధంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తాము ప్రకటించిన నవరత్నాల పథకంతో సమాజంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఏపీకి శ్రతువు ప్రధాని నరేంద్రమోదీనా.? రాహుల్ ..? అనే ప్రశ్నకి జగన్ సమాధానమిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఏపీని కాంగ్రెస్ పార్టీ విభజించి మోసం చేస్తే.. ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోకుండా ప్రధాని నరేంద్రమోదీ మోసం చేసిందన్నారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో చేర్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. కాబట్టి ఏపీ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ వెన్నుపోటు పొడిచాయని చెప్పారు.
పూర్తి వీడియోను కింద చూడండి.
"
