వైసీపీ ప్రధాన కార్యదర్శి సీ రామచంద్రయ్య.. ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ జేడీ లక్ష్మీనారాయణపై మండిపడ్డారు.  జగన్ కి వ్యతిరేకంగా పనిచేయలేదన్న కారణంతోనే చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారని ఆరోపించారు. 

జేడీ లక్ష్మీనారాయణ ద్వారా వైఎస్‌ జగన్‌ను జైల్లో పెట్టించడానికి చంద్రబాబే కారణమని, ఇందుకు ఆయన టీడీపీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారమే నిదర్శమని అభిప్రాయపడ్డారు. జేడీ లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబుకు సహకరించారని, దానికోసమే ఆయన మేలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. మరి ఇప్పుడు జేడీకి టీడీపీలో అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 

రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకి ఓటమి తప్పదని.. అందుకే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ సీఎం అవ్వడం ఖాయమని.. అది పాదయాత్రలోనే స్పష్టమైందన్నారు. ఈ విషయం