తెలంగాణ మంత్రి తలసాని యాదవ్ కి వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తలసాని.. ఇటీవల ఏపీలో పర్యటనకు వచ్చి.. చంద్రబాబు పై విమర్శల దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో  వియ్యంకుడి వ్యవహార తీరుపై పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు.
 
కుక్రవారం పుట్టా సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరులో పర్యటించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు రాజకీయ భిక్షతోనే ఈ స్థాయికి ఎదిగావు. దానిని మరిచిపోయి ఆయన్నే విమర్శించడం తగదు’’ అంటూ... తలసానికి పుట్టా సూచించారు. 

ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజన తర్వాత కూడా బీసీలు ఈ స్థాయికి ఎదిగారంటే అది కేవలం చంద్రబాబు వల్లేననన్నారు. తలసాని తో పాటు మంత్రి యనమల, తాను ఈ స్థాయిలో ఉన్నామంటే చంద్రబాబే కారణమని మరిచిపోవద్దని గుర్తు చేశారు.

 తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎప్పుడూ లేని విధంగా టీటీడీ చైర్మన్‌గా నన్ను నియమించారనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.  బీసీల్లోని వివిధ వర్గాలకు కూడా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించిన ఘనత చంద్రబాబుదన్నారు.

తమ రాష్ట్రం బీసీలకు అన్యాయం చేసిందంటూ మాట్లాడటం తగదని తలసానికి సూచించారు. తనకు తలసాని వియ్యంకుడు అయినప్పటికీ.. చంద్రబాబుని విమర్శించే ఊరుకోనని హెచ్చరించారు.