ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ లపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శల దాడికి దిగారు.  ట్విట్టర్ వేదికగా.. డేటా స్కాం వ్యవహారంపై సెటైర్లు వేశారు. డేటా స్కాం విషయంలో చంద్రబాబు తన తప్పేం లేదని ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన అన్నారు.

డేటా చోరీలో తన తప్పేమీ లేకపోతే... ఐటీ గ్రిడ్స్ సీఈశో అశోక్ ను ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. మూలాలపై దెబ్బ కొడతా, తోకలు కత్తిరిస్తానని బెదిరించేది చంద్రబాబేనని, మళ్లీ తనను భయపెడుతున్నారని, మానసిక క్షోభకు గురిచేస్తున్నారని శోకాలు పెట్టేది కూడా ఆయనేన్నారు. 

చంద్రబాబు తీరు చూస్తుంటే.. రెండు నాల్కలు ఉన్న వ్యక్తి ఒక్కో దానితో ఒక్కో మాట పలికినట్టుందని, అయినా రెండు సిట్లు వేశారుగా ఎందుకు వణికి పోతున్నారని ప్రశ్నించారు. ఐటి గ్రిడ్స్‌పై దర్యాప్తు మొదలైనప్పటి నుంచి పప్పు నాయుడు (నారాలోకేష్‌) తలుపు వెనక దాక్కుని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌పై ట్వీట్లు చేయిస్తున్నాడని, డేటా దొంగ అశోక్‌ను ఎందుకు దాచాల్సి వచ్చిందో మాత్రం చెప్పడం లేదన్నారు. 

అదేదో బయటకొచ్చి చెబ్తే వినాలని ఐదు కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇక డేటా స్కాం మీద ప్రెస్ మీట్ పెట్టటం కూడా చేతగాని దద్దమ్మను ఐటీ  మినిస్టరుగా పెట్టుకుని, కులగజ్జి సన్నాసితో నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొరిగించే  స్థితికి టీడీపీ దిగజారిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేబినెట్ అంతా కలిసి ఎందులో అయినా దూకితే మేలని మండిపడ్డారు.