వాల్తేరు డివిజన్‌ను విశాఖ రైల్వే‌జోన్‌లో కలపాలంటూ శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు 15 గంటల పాటు దీక్షను విద్యార్ధినులు విరమింపజేశారు. 


శ్రీకాకుళం: వాల్తేరు డివిజన్‌ను విశాఖ రైల్వే‌జోన్‌లో కలపాలంటూ శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు 15 గంటల పాటు దీక్షను విద్యార్ధినులు విరమింపజేశారు.

మంగళవారం సాయంత్రం రామ్మోహన్ నాయుడు దీక్షను ప్రారంభించారు. బుధవారం నాడు ఉదయం 9 గంటలకు దీక్షను విరమించారు.వాల్తేరు డివిజన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. 

శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుండి ఇచ్ఛాపురం వరకు ఉన్న ఏడు రైల్వే స్టేషన్లను కుర్ధా డివిజన్‌ నుండి తప్పించాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. ఈ ఏడు రైల్వేస్టేషన్లను విశాఖ డివిజన్‌లో కలపాలని ఆయన డిమాండ్ చేశారు.

బుధవారం నాడు ఉదయం 9 గంటలకు స్కూల్ విద్యార్థినులు నిమ్మరసం ఇవ్వడంతో రామ్మోహన్ నాయుడు దీక్షను విరమించారు. రైల్వేజోన్ ఇచ్చిన సంతోషం తమకు లేదని రామ్మోహన్ నాయుడు చెప్పారు.