గల్లా జయదేవ్ గుంటూరుకు ఒక అతిథి లాంటి వ్యక్తేనని, పార్లమెంటు సభ్యునిలా ఆయన ప్రవర్తించలేదన్నారు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి. ఇవాళ హైదరాబాద్‌లో మోదుగుల.. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ని కలిశారు.

అనంతరం కొన్ని అంశాలపై చర్చించి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జయదేవ్‌కు బ్యాలెట్ ద్వారా బుద్ది చెబుతానన్నారు. ఫ్లెక్సీలో పేరు, ఫోటో వేయకపోతే నన్ను అడగటం ఏ మాత్రం బాలేదని మోదుగుల ఆవేదనం వ్యక్తం చేశారు.

2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ఉత్తరాది ఎంపీల చేతుల్లో దెబ్బలు తిన్నానని.. అలాంటి తనను ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా నిలబెట్టడం తనను తీవ్రంగా బాధించిందన్నారు.

తెలుగుదేశం పార్టీ మీద తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని మోదుగుల తెలిపారు. కొద్దిరోజుల క్రితం పార్టీ సమావేశంలో ఎంపీ గల్లా జయదేవ్.. మోదుగులపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.

గుంటూరు ఎంపీ సీటుపై మోదుగుల కన్నేశారని.. అందుకే తనకు సరైన గౌరవం ఇచ్చేవారు కాదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో మోదుగుల తనప నిలబడి గెలవాలంటూ సవాల్ విసిరారు.