త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికల్లో జగన్, కేసీఆర్ లు కలసి కట్టుగా తమపై కుట్ర చేస్తున్నారని చంద్రబాబు, టీడీపీనేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంలో తనకు మరో క్లూ దొరికిందందటున్నారు మంత్రి లోకేష్. బుధవారం లోకేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా ఉంది.

ఏపీ ఎన్నికల ప్రచారానికి వైసీపీ నేతలు.. టీఆర్ఎస్ వాహనాలు వాడుతున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను లోకేష్ షేర్ చేశారు. అంతేకాదు.. ‘‘తెలంగాణ దొరగారి కారు...ఆంధ్రాలో జగన్ షికారు! వైకాపా కారు చూడ మేలిమై ఉండు సీటు విప్పిచూడ కారు గుర్తు ఉండు. రంగు మార్చుడెందుకు కలువకుంట జగన్ గారూ, దొరగారి ప్ర``గఢీ``భవన్ గులాబీ తోటలో పువ్వే మీరు!’’ అంటూ ఓ కవితను కూడా రాశారు.

వేమన పద్యాన్ని పేరడీ చేసి.. జగన్- కేసీఆర్ ల బంధాన్ని ఈ విధంగా తెలియజేశారు. కాగా.. ఈ ట్వీట్ కి నెటిజన్ల నుంచి రెస్పాన్స్ బాగుంది.