అభినందన్ సాహసం, తెగువ ఈనాటి యువతకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. జాతి యావత్తు అభినందన్ రాకకోసం ఎదురుచూస్తున్న తరుణంలో తన తరపున జనసైనికుల తరపున శుభాభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్.  

విజయవాడ: వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ సురక్షితంగా బారత్ కు తిరిగి రావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. భారత వాయుసేన యోధుడు అభినందన్ మన పుణ్యభూమికి తిరిగి చేరుకోవడం ఎంతో ఆనందాన్నికలిగించిందన్నారు. 

అతను సార్థక నామధేయుడు అంటూ కొనియాడారు. జాతి యావత్తు అభినందనలు అందజేసిన గొప్పదేశభక్తుడు అంటూ కొనియాడారు. శత్రువు చేతికి చిక్కినా మెుక్కవోని అతని ధైర్యం అందర్నీ అబ్బురపరచిందన్నారు. 

అభినందన్ సాహసం, తెగువ ఈనాటి యువతకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. జాతి యావత్తు అభినందన్ రాకకోసం ఎదురుచూస్తున్న తరుణంలో తన తరపున జనసైనికుల తరపున శుభాభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్. 

Scroll to load tweet…

ఈ వార్తలు కూడా చదవండి

అభినందన్ దేశభక్తికి నా వందనం: చంద్రబాబు