పవన్‌ మాటలను ప్రధానంగా పాకిస్తాన్‌ వాడుకుంటోందని,ఇప్పటికైనా పవన్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని జీవిఎల్ అన్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో తెలిస్తేనే పవన్‌కు ప్రజాదరణ ఉంటుందని సూచించారు.

విజయవాడ: నిన్నటి వరకు హీరో శివాజీతో అర్థంపర్థంలేని విమర్శలు చేయించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా పవన్‌ను తెరమీదకి తీసుకొచ్చాడని జీవీఎల్‌ నరసింహా రావు వ్యాఖ్యానించారు. చిన్న హీరో స్థాయి సరిపోవడం లేదని, పెద్ద హీరోతో మాట్లాడిస్తున్నారేమోనని ఆయన అన్నారు. 

పవన్‌ మాటలను ప్రధానంగా పాకిస్తాన్‌ వాడుకుంటోందని,ఇప్పటికైనా పవన్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని జీవిఎల్ అన్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో తెలిస్తేనే పవన్‌కు ప్రజాదరణ ఉంటుందని సూచించారు.

రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు, పవన్‌ కల్యాన్‌, మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. భారత్‌పై నిందలు మోపీ పాకిస్తాన్‌లో హీరోలు కావాలని ఉబలాటపడుతున్నారని అన్నారు.

పాకిస్తాన్‌పై భారత్‌ చర్యలను తప్పుబడుతూ చంద్రబాబు, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జీవీఎల్‌ అన్నారు. చంద్రబాబును దేశమంతా చివాట్లు పెట్టిందని చెప్పారు. దాంతో యూటర్న్‌ బాబుగా పేరొందిన చంద్రబాబు మాట మార్చారని తెలిపారు. జనసేన అధినేత పవన కల్యాణ్‌ (పీకే) కూడా ఈ మధ్య పాకిస్తాన్‌పై ప్రతీకారం విషయంలో వింతగా మట్లాడుతున్నారని జీవీఎల్‌ అన్నారు. 

పీకే అంటే పాకిస్తాన్‌ షార్ట్‌కట్‌ అని అక్కడి జనం భ్రమపడుతున్నారని అన్నారు చంద్రబాబు ప్రభావం వల్లనే పవన్‌ అలా మాట్లాడుతున్నారని అన్నారు. ఒకప్పడు పెదబాబు, చినబాబును విమర్శించే పవన్‌.. ఇప్పుడు వారిని పల్లెత్తు మాట కూడా అనడం లేదని అన్నారు.