తనపై మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలవాలని  గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్  డిమాండ్ చేశారు.

అమరావతి: తనపై మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలవాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గురువారం నాడు ఆయన గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి నుండి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తనకు గౌరవం ఇచ్చేవాడు కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడ తన పేరును ప్రస్తావించేవాడు కాదని ఆయన గుర్తు చేశారు.

గుంటూరు నుండి వైసీపీ అభ్యర్ధిగా మోదుగుల పోటీ చేస్తే నా సత్తా ఏమిటో చూపిస్తానని గల్లా జయదేవ్ అన్నారు.వైసీపీకి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టేనని గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. రెండు రోజుల క్రితం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.