ఏపీ రాజకీయాలపై మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. కాగా.. తనకు రాజకీయాల పరంగా శిష్యులు ఎవరూ లేరని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. తనతో అందరూ స్నేహంగానే ఉండేవారని.. ప్రత్యేకించి శిష్యులు ఎవరూ లేరని చెప్పారు.

అప్పట్లో తాను ఒత్తిడి తట్టుకోలేక సీఎం పదవికి రాజీనామా చేసినట్లు ఆయన వివరించారు. అంతేతప్ప.. తాను గవర్నర్ పదవికి ఆశపడి సీఎం పదవికి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు.  2016 నుంచి తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని.. తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారని ఆయన తెలిపారు.

ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందో లేదో చెప్పలేమన్నారు. ఏపీలో కాం గ్రెస్ పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తోందన్నారు. ఆ పాపంలో తలో పిడికెడు అన్నట్టుగా అందరికీ భాగం ఉందన్నారు. అప్పుడు కాంగ్రెస్ లో తాను ఉన్నాను కాబట్టి.. తనకు కూడా భాగం ఉందన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్ కుర్రాడు అన్నారు. పవన్.. రాష్ట్రానికి ఏదో చేయాలనే తపనతో ఉన్నాడని.. చూద్దాం ఏం చేస్తాడో అని ఆయన అన్నారు.