విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి విద్యుత్‌ శాఖ షాక్‌ ఇచ్చింది. కార్యాలయానికి సంబంధించిన బిల్లు బకాయిలు భారీగా పేరుకుపోవడంతో మంగళవారం ఫ్యూజులు తొలగించి సరఫరా నిలిపివేసింది. టీడీపీ కార్యాలయం సుమారు రూ.4.8 లక్షల మేర విద్యుత్‌ శాఖకు బకాయిపడింది

. గతంలో పార్టీ కార్యాలయ వ్యవహారాలను సీనియర్‌ నేత ఎంవీవీఎస్‌ మూర్తి చూసుకునేవారు. ప్రతి నెలా రూ.80 వేల వరకూ బిల్లు వచ్చేది. ఆయనే చెల్లించేవారు. ఆయన మరణానంతరం ఈ బిల్లులు చెల్లించేందుకు ఎవరూ శ్రద్ధ చూపకపోవడంతో బకాయిలు పేరుకుపోయి ఈ పరిస్థితి తలెత్తింది.