వైసీపీ నేత జగి రమేష్ ఇంటికి దేవినేని ఉమా ఇంటికి వెళ్లారు.  ప్రత్యర్థి ఇంటికి ఓటు అడగడానికి దేవినేని ఉమా వెళ్లడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. జోగి రమేష్ తండ్రి, ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ జోగి మోహన్‌రావును ఇంటింటికీ తెలుగుదేశం భాగంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేయాల్సిందిగా కోరారు. 

అనంతరం పక్కనే ఉన్న  ఉన్న మాజీ ఎంపీపీ చెరుకు మాధవరావును కూడా మంత్రి ఓటు అడిగారు. పార్టీలు పక్కన పెట్టి మంత్రి ఉమా ఓ సామాన్య ఓటర్‌ను ఓటు అభ్యర్థించిన విధంగా వైసీపీ ముఖ్య నేతలైన ఆ ఇద్దరిని, అందులో తనపై 2014లో మైలవరం నుంచి వైసీపీ బరిలో నిలిచి ఓటమి చెందిన జోగి రమేష్ తండ్రిని ఓటు కలిసి అడగడం విశేషం.