అమరావతి:పాకిస్థాన్ ఆర్మికి చిక్కిన భారత్ పైలట్ విక్రమ్ అభినందన్ క్షేమంగా ఉండాలంటూ దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. సురక్షితంగా రావాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ కబంధ హస్తాలలో చిక్కుకుపోయిన భారత పైలట్‌ విక్రమ్ అభినందన్‌ క్షేమంగా తిరిగిరావాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. అభినందన్ ధైర్యసాలి అంటూ ప్రశంసించారు. 

 

అభినందన్ కు అంతా మంచి జరగాలని తానుప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు. మరోవైపు అభినందన్‌ ధైర్యశాలి అని, అతనికోసం తానూ ప్రార్థిస్తున్నానని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. అతను త్వరలోనే మన గడ్డమీదకు తిరిగి వస్తారంటూ ట్వీట్‌ చేశారు. 

 

అభినందన్ కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలంటూ ఆకాంక్షించారు. ఇకపోతే విక్రమ్ అభినందన్ సురక్షితంగా ఇండియాకు తిరిగి రావాలంటూ వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆకాంక్షించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అభినందన్ క్షేమంగా తిరిగి రావాలి: వైఎస్ జగన్ ఆకాంక్ష