ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ ప్రభుత్వాల మధ్య డాటా చోరీ వ్యవహారంపై ఘర్షణ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇరు ప్రభుత్వాలు ఈ వ్యవహారానికి సంబంధించి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ డాటా చోరీపై మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారం మొత్తం ఓ పెద్ద కుట్రలో భాగంగా జరిగిందని ఆయన ఆరోపించారు.   

డిల్లీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఏపిలోని ప్రతిపక్షం కలిసి ఈ మహాకుట్రకు నాంది పలికారని చంద్రబాబు ఆరోపించారు. కేవలం ఒక్క టిడిపి పార్టీని నాశనం పట్టించడానికి వ్యవస్థ మొత్తాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. దేశ ప్రజలందరు ఈ విషయంపై ఆలోచించాలని చంద్రబాబు ఆరోపించారు. 

తెలంగాణ లొ మళ్లీ దొరల పాలన మొదలయ్యిందని...ఆ రాష్ట్ర పోలీసులు, అధికారులు పటేళ్ల వద్ద పనిచేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం కూడా తమ కుట్రల్లో వారిని భాగస్వామ్యం చేస్తోందని చంద్రబాబు ఆగ్ఱహం వ్యక్తం చేశారు. 

 డాటా చోరీ కేసులో తమను ఇరికించడానికి మొదట డిల్లీలో స్కెచ్ వేశారన్నారు. విజయ సాయి రెడ్డి ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదుతోనే ఆ విషయం బయటపడుతోందని చంద్రబాబు గుర్తుచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ యాక్షన్ ప్లాన్ మొదలయ్యిందని ఆరోపించారు. అసలు ఫిర్యాదు లేకుండానే ఓ ప్రభుత్వానికి సంబంధించిన ఔట్ సోర్సింగ్ ఐటీ కంపనీపై దాడులేలా చేస్తారని ప్రశ్నించారు. 

 తెలంగాణ పోలీసులు కూడా చాలా ట్విస్ట్ లు ఇస్తున్నారని...మొదట ఒక పోలీస్ అధికారి ఒకలా మాట్లాడి ఆ తర్వాత మరొకరు మరోలా మాట్లాడారన్నారు. ఇన్ని రకాల కుట్రలు బాహుబలి సినిమాలో కూడా ఉండవని చంద్రబాబు అన్నారు.  

డిల్లీ స్కెచ్ తర్వాత మూడు రోజులకు ఈ కుట్రలోకి తెలంగాణఱ ప్రభుత్వం ఎంటరయ్యిందని చంద్రబాబు ఆరోపించారు. ఈ వ్యవరాన్ని మొత్తాన్ని గమనిస్తే తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వమే తమ డాటాను చోరీ చేసినట్లు తేటతెల్లమవుతోందన్నారు. ఇలా దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు తమనే దొంగలంటున్నారని మండిపడ్డారు. 

 ఐటీ గ్రిడ్ పై సంస్థపై దాడులు చేసి తమ ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం డేటాను ఎత్తుకుపోయారని అన్నారు.  పోలీసులే లూటీలు చేసే డేకాయిడ్ మూఠాల్లాగా వ్యవహరించారన్నారు. పోలీసులు అతిగా ప్రవర్తించడం మంచిదికాదని...హత్యలు, అత్యాచారాలు, డ్రంక్ ఆండ్ డ్రైవ్ మాదిరిగా అర్థరాత్రి కేసులు బనాయించడం ఏంటని ప్రశ్నించారు.