Asianet News TeluguAsianet News Telugu

ఆ ఫోన్‌ కాల్స్‌ డేటాను ప్రభుత్వానికి కూడా అందించడంలేదు: ఏపి ఐటి శాఖ

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓటర్ల వ్యక్తిగత సమాచారం లీకేజి వ్యవహారం గత మూడు రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను వేడెక్కించింది. ఈ వ్యవహారం వల్ల ఏపి, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందంటూ టిడిపి ఆరోపిస్తుండగా...డాటా లీకేజి హైదరాబాద్ కేంద్రంగా జరిగింది కాబట్టి తెలంగాణ పోలీసుల చేత దర్యాప్తు చేయిస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటోంది. మొత్తానికి ఈ కేసు తెలుగు రాష్ట్రాల రాజకీయ సంబంధాలను పూర్తిగా దెబ్బతీసిందనే చెప్పాలి. 

ap  it department chief secretary vijayanand talks about data leakage issue
Author
Amaravathi, First Published Mar 6, 2019, 8:54 AM IST

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓటర్ల వ్యక్తిగత సమాచారం లీకేజి వ్యవహారం గత మూడు రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను వేడెక్కించింది. ఈ వ్యవహారం వల్ల ఏపి, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందంటూ టిడిపి ఆరోపిస్తుండగా...డాటా లీకేజి హైదరాబాద్ కేంద్రంగా జరిగింది కాబట్టి తెలంగాణ పోలీసుల చేత దర్యాప్తు చేయిస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటోంది. మొత్తానికి ఈ కేసు తెలుగు రాష్ట్రాల రాజకీయ సంబంధాలను పూర్తిగా దెబ్బతీసిందనే చెప్పాలి. 

అయితే ఈ డాటా లీకేజీపై ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు  ఏపికి చెందిన ఓటర్ల వ్యక్తిగత సమాచారం లీకేజికి  గురయ్యే అవకాశమే లేదని... డాటా లీకేజీపై వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. రాజకీయ దుమారం రేపుతున్న ఈ వ్యవహారంపై ఐటీ శాఖ తరపున వివరణ ఇచ్చేందుకు విజయానంద్ మీడియా  సమావేశం ఏర్పాటుచేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆధార్‌ డేటా చోరీకి గురయ్యేందుకు ఆస్కారమే లేదన్నారు. ఆ డేటా అంతా పూర్తిస్థాయిలో భద్రంగా ఉందన్నారు. అలాగే  ప్రజాసాధికార సర్వే ద్వారా సేకరించిన సమాచారం మొత్తం కూడా భద్రంగానే వుందని తెలిపారు. ఈ సమాచారాన్ని కొన్ని ప్రభుత్వ శాఖలకు మాత్రమే అందిస్తామని వివరించారు. 

తాము సేకరించచిన డేటా బేస్‌ ఆధారంగానే ఏపీలో 26 లక్షల కొత్త రేషన్‌ కార్డులు, 4 లక్షలకు పైగా నిరుద్యోగ భృతి, తిత్లీ బాధిత రైతులకు నష్టపరిహారం, 95 లక్షలకు పైగా మహిళలకు పసుపు-కుంకుమ పంపిణీ, 54 లక్షల మందికి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. పూర్తిస్థాయి భద్రతతో కూడిన డేటా బేస్‌ కావడం వలనే ఇంత భారీ స్థాయిలో లబ్ధిదారులకు సేవలు అందించగలిగామని అన్నారు. ఫిర్యాదుల నిమిత్తం 1100కు వచ్చే ఫోన్‌ కాల్స్‌ డేటా కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లే అవకాశమే లేదు. ప్రభుత్వ శాఖలకు కూడా ఆ డేటాను ఇవ్వడం లేదని విజయానంద్‌ స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios