విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి హత్యకేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. 

విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి హత్యకేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మంగళవారం మధ్యాహ్నం విజయారెడ్డి హత్యకు గురైంది. 

ఓ అపార్టుమెంట్‌లోని 5వ ఫ్లోర్‌లో ఉంటున్న విజయారెడ్డి దగ్గరకు హేమంత్ అనే వ్యక్తి వచ్చాడు. ఫ్లాట్ కొనుగోలు పేరుతో ఆమె దగ్గరకు వచ్చిన అతను బంగారం కోసం ఆమెను హత్యచేసి బాంత్ రూంలో పడేశాడు. 

కాగా... పోలీసులకు లభించిన ప్రాథమిక ఆధారాలతో హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే హత్యచేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. నిందితుడిని నేడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.