తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి. వైఎస్ జగన్ పాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసునంటూ చురకలు అంటించారు.

తమ పాలనపై టీడీపీ నేతలు పనిలేక మాట్లాడుతున్నారని.. వారి విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పదవులు రాలేదని వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో లేరని పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం నామినేటెడ్ పదవులు ప్రకటిస్తామని సుబ్బారెడ్డి వెల్లడించారు.

మరోవైపు మంత్రి పదవిపై ఆశపెట్టుకున్న నగరి ఎమ్మెల్యే రోజాకు నిరాశ ఎదురవ్వడంతో ఆమె అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని తన నివాసానికి రోజాను పిలిపించిన ముఖ్యమంత్రి జగన్ ఆమెతో మాట్లాడారు.