యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కి, ఎన్నికల కమిషన్ కి ఢిల్లీ కోర్ట్ నోటీసులు ఇచ్చింది. తమ పార్టీ పేరు వాడుకుంటూ తమకు నష్టం కలిగిస్తున్నారని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ భాష ఢిల్లీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఇరువురికి నోటీసులను పంపించింది. 

తాను ముస్లిం మైనారిటీని కాబట్టి తనను తొక్కివేశారని, ఎన్నికల కమిషన్ కి పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ... వారు పట్టించుకోకపోవడంతో తాను ఇలా హై కోర్టు మెట్లెక్కానని మహబూబ్ భాషా అన్నారు. 

జాతీయ ముస్లిం ఇత్తెహాద్ మంచి కి తాను వైస్ ప్రెసిడెంట్ ని కూడా అయినందున కేంద్రం తీసుకొచ్చిన సిఏఏ, ఎన్నార్సీలకు తమ పార్టీ వ్యతిరేకమని, కానీ వైసీపీ పార్లమెంటులో మద్దతిచ్చిందని, ఇలా తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు. 

రఘురామకృష్ణం రాజు ఎపిసోడ్ జరుగుతుండగా ఈ విషయం తెరమీదకు రావడంతో.. ఆయన ప్రోద్భలంతోనే మహబూబ్ భాషా కేసు దాఖలు చేసాడని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 

ఇకపోతే... నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  ఏపీ హైకోర్టులో శుక్రవారం నాడు రెండు క్వాష్ పిటిషన్లను దాఖలు చేశారు.తనపై నమోదైన కేసులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గురువారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం నాడు మంత్రి శ్రీరంగనాథరాజు ఎంపీపై పోడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

also read:రఘురామకృష్ణంరాజు Vsవైసీపీ ఎమ్మెల్యేలు: ఎంపీపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫిర్యాదు

వెంటనే మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, ప్రసాదరాజులు వేర్వేరుగా వేరే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

ఈ కేసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్లలో రఘురామకృష్ణంరాజు  కోరారు.  ఈ క్వాష్ పిటిషన్లపై ఎంపీ రఘురామకృష్ణంరాజు విచారణను వాయిదా వేశారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాాలకు పాల్పడుతున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజుపై  అనర్హత వేటేయాలని కోరుతూ లోక్ సభ స్పీకర్  ఓం బిర్లాకు  ఈ నెల 3వ తేదీన వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేకంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సాక్ష్యాలను కూడ వైసీపీ ఎంపీలు స్పీకర్ కు సమర్పించారు.