చోడవరం: విశాఖ జిల్లా  చోడవరం మండలం బోగాపురం లో వైసీపీ నేతల మధ్య వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. అప్పలరాజుపై ప్రత్యర్ధులు దాడికి దిగారు.తమ మాట వినడం లేదని అప్పలరాజు అనే యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు. కొన్నేళ్లుగా అప్పలరాజు స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి అనుచరుడుగా ఉన్నాడు.

 గ్రామంలోని ఇతర వైసీపీ నేతలకు అప్పలరాజుకు  మధ్య విభేదాలున్నాయి.అప్పల రాజు తల్లీకి వృద్దాప్య పెన్షన్ ను నిలిపివేశారు. అప్పలరాజుకు చెందిన  పశు సంపధను  ప్రత్యర్ధులు అమ్మెశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అప్పలరాజు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలే అప్పలరాజుపై దాడికి దిగడం స్థానికంగా చర్చకు దారి తీసింది. ఈ దాడి అంశం పార్టీలో కూడ చర్చకు దారి తీసింది.

ఎమ్మెల్యే అనుచరుడుగా ఉంటూ తమ మాటను లెక్క చేయడం లేదనే ఉద్దేశ్యంతోనే ఈ దాడికి దిగినట్టుగా చెబుతున్నారు. ఈ విషయమై పార్టీ నాయకత్వం కూడ ఆరా తీసినట్గుగా సమాచారం.