లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి టీడీపీ, వైసీపీల తరపున ఎన్నికైన సభ్యులు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేశారు.

ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, బీవీ సత్యవతి, వల్లభనేని బాలశౌరీ, నందిగం సురేశ్, తలారి రంగయ్య, వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, రెడ్డప్ప తెలుగులో ప్రమాణం చేశారు.

రఘురామ కృష్ణంరాజు, కోటగిరి శ్రీధర్, లావు శ్రీకృష్ణదేవరాయులు, మాగుంట్ల శ్రీనివాసులు రెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి, సంజీవ్ కుమార్, గోరంట్ల మాధవ్, బల్లి దుర్గాప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. అటు టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు హిందీలో, కేశినేని నాని, గల్లా జయదేవ్ ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేశారు.