అమరావతి: ఏపీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి.  ఏమైంది యనమల గారూ? తెలంగాణ లబ్ది కోసం జగన్‌ గారు రాష్ట్రాభివృద్ధికి గండికొడుతున్నారా? అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. 

ఆర్ధిక మంత్రిగా రాష్ట్రాన్ని20 ఏళ్లు వెనక్కు నెట్టిన ఘనులు మీరు. ఎన్నికల ముందు కూడా ఇలాగే కేసీఆర్, మోదీలతో చేతులు కలిపామని ఆరోపణలు చేస్తే ప్రజలు మీపై తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా? అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ట్వీట్ ను మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీకి ట్యాగ్ చేశారు విజయసాయిరెడ్డి.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ రుణం తీర్చుకోవడానికి జగన్ ఏపీలో ఆర్ధికమాంద్యం సృష్టిస్తున్నారని యనమల ఆరోపించారు.

ఏపీలో ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసి హైదరాబాద్‌లో ఎకానమీని పెంచడమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ఆర్ధిక మాంద్యానికి జగన్ రివర్స్ రూలింగే కారణమని ఆరోపించారు. 

మరోవైపు జగన్ ఆదేశాలతోనే  రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం కావాలన్నదే జగన్ స్వప్పమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఏపీకి చంద్రబాబు గుర్తింపు తెస్తే దానిని జగన్ నాశనం చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు యనమల రామకృష్ణుడు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల