అశోక్ గజపతిరాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాన్సాస్ వేలం పేరుతో జరిగిన భూమాయ బయటపడుతోందని ఆయన చెప్పారు. విజిలెన్స్ విచారణలో పూసపాటి అశోక్ ముసుగు తొలగిపోయిందని అన్నారు.  

టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాన్సాస్ వేలం పేరుతో జరిగిన భూమాయ బయటపడుతోందని ఆయన చెప్పారు. విజిలెన్స్ విచారణలో పూసపాటి అశోక్ ముసుగు తొలగిపోయిందని అన్నారు. దేవాదాయశాఖ అనుమతి లేకుండా ప్రైవేట్ వెబ్ సైట్ క్రియేట్ చేసి వేలం వేశారంటేనే అసలు ఉద్దేశం ఏమిటో అర్థమవుతుందని చెప్పారు. వ్యవస్థను భ్రష్టు పట్టించి ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తే ఉపయోగం ఏంటి రాజా? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…