విశాఖపట్నం: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్దం ఏపి రాజకీయాల్లో వేడిని పెంచింది. ఈ ఘటనకు మీరంటే మీరు కారణమని అదికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందిస్తూ టిడిపి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాజీ సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. 

''రాజకీయ కుట్రలు, కుతంత్రాలను ఉపేక్షించేది లేదు. వర్గ వైషమ్యాలు సృష్టించాలనుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంతర్వేది ఘటనలో దోషులు  ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు. కొత్త రథం తయారీకి రూ.95 లక్షలు మంజూరు చేసింది జగన్ గారి సర్కార్. నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతోంది'' అని విజయసాయి పేర్కొన్నారు.

read more  అంతర్వేది రథానికి మంటలు... మా ప్రభుత్వంపై కుట్రలో భాగమే: మంత్రి వెల్లంపల్లి
 
''తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు'' అంటూ చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేస్తూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. 

''అందర్వేది ఆలయ రథం దగ్ధంపై గంటల వ్యవధిలోనే నిజ నిర్ధారణ కమిటీ వేశారు చంద్రబాబు గారు. స్వర్ణ ప్యాలేస్ అగ్నిప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పేతే కనీసం నోరు కూడా మెదపలేదెందుకని ప్రజలు అడుగుతున్నారు. రమేశ్ హాస్పిటల్స్ పై ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడాడు'' అంటూ విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు.