పెదనాయుడు, చిననాయుడు అంటూ బాబు, లోకేష్ లపై విజయసాయి పంచులు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ లపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పెదనాయుడు, చిననాయుడు అనే తండ్రి కొడుకులు తప్పిపోయారని వారిని ఏపీకి పంపించాలంటూ ఆయన ట్విట్టర్ వేదికగా పంచ్ లు విసిరారు. 

YSRCP MP Vijayasai reddy Mocks TDP Supremo Chandrababu Naidu and his Son Lokesh

దేశమంతా కరోనా వైరస్ కాక కొనసాగుతున్నప్పటికీ.... ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజకీయ వేడి ముందు కరోనా వైరస్ బలాదూర్ అని చెప్పక తప్పదేమో! అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. 

తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ లపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పెదనాయుడు, చిననాయుడు అనే తండ్రి కొడుకులు తప్పిపోయారని వారిని ఏపీకి పంపించాలంటూ ఆయన ట్విట్టర్ వేదికగా పంచ్ లు విసిరారు. 

చంద్రబాబు నాయుడు, లోకేష్ లు హైదరాబాద్ లోనే ఈ కరోనా వైరస్ లాక్ డౌన్ విధించినప్పటినుండి ఉంటున్న విషయం తెలిసిందే!ఆయన ఈ విషయమై వారిని ఎద్దేవా చేస్తూ ఇలా రాసుకొచ్చారు. 

"పెదనాయుడు చిననాయుడు అనే తండ్రీ కొడుకుల కుటుంబం ఏపీ నుంచి తప్పిపోయి హైదరాబాద్‌లో ఉండిపోయింది. వారిద్దరినీ బలవంతంగా వ్యాన్‌ ఎక్కించి మా రాష్ట్రానికి పంపండి.

ప్లైట్‌లోనే వైజాగ్ వెళ్తానని రెండు రోజులుగా మారాం చేస్తున్నావ్‌. కారులో అయితే ఆరేడు గంటల ప్రయాణమే కదా?" అంటూ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసారు విజయసాయి రెడ్డి. 

ఇకపోతే... భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం... కోవిడ్ -19 కేసుల సంఖ్య 60 వేలకు చేరువ కాగా, మరణాలు 2 వేలకు చేరువగా వచ్చాయి. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 59,662 నమోదయ్యాయి. కరోనా వైరస్ మరణాల సంఖ్య 1,981కి చేరుకుంది.

ఇప్పటి వరకు కోరనా వ్యాధి నుంచి 17,846 మంది కోలుకున్నారు. దాంతో యాక్టవ్ కేసుల సంఖ్య 39,834 ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 3320 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 95 మరణాలు సంభవించాయి.

గత కొద్ది రోజులుగా భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి రోజూ 3 వేలకుపైగానే కొత్త కోవిడ్ -19 కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 216 జిల్లాలో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదు. 

మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 19,089కి చేరుకుంది. శుక్రవారంనాడు కొత్దగా 1,089 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 37 మదంి మృత్యువాత పడ్డారు. దీంతో మహారాష్ట్రలో మరణాల సంఖ్య 731కి చేరుకుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios