అవసరమైతే గిరిజనుల రిజర్వేషన్ ను ఏడు నుండి 9 శాతానికి పెంచాలి: రాజ్యసభలో విజయసాయి రెడ్డి

గిరిజన రాజ్యాంగ సవరణ బిల్లుపై  రాజ్యసభలో  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ  విజయసాయిరెడ్డి  ఇవాళ  ప్రసంగించారు.

YSRCP MP  Vijayasai Reddy Demands To Increase  Tribes  Reservation  upto  9 Percent lns

న్యూఢిల్లీ:అవసరమైతే గిరిజనుల రిజర్వేషన్  కోటాను  ఏడు శాతం నుండి 9 శాతానికి  పెంచాలని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. గిరిజన రాజ్యాంగ సవరణ బిల్లుపై  రాజ్యసభలో  మంగళవారంనాడు చర్చ జరిగింది.ఈ చర్చలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  పాల్గొన్నారు. గిరిజనులకు  పోడు భూముల పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్‌సీదేనని ఆయన గుర్తు  చేశారు

. రాష్ట్రంలో గిరిజన యూనివర్శిటీని  ఏర్పాటు చేస్తున్నామన్నారు. బోయ, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని ఏపీ అసెంబ్లీ  చేసిన తీర్మానం గురించి  విజయసాయి రెడ్డి ప్రస్తావించారు.  ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపినట్టు చెప్పారు. మహిళలకు  చట్ట సభల్లో  రిజర్వేషన్లు కల్పించాలని  విజయసాయి రెడ్డి  డిమాండ్  చేశారు. మొదటి నుండి మహిళలకు రిజర్వేషన్ల విషయంలో  తమ పార్టీ అనుకూలంగా ఉందని  విజయసాయి రెడ్డి  చెప్పారు. 

మణిపూర్ అంశంపై  పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళ వాతావరణం నెలకొంది.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల  20వ తేదీన ప్రారంభమయ్యాయి.  ఈ సమావేశాలు  ప్రారంభమైన రోజు నుండి  మణిపూర్ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.  మణిపూర్ అంశంపై  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.  పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఇదే విషయమై  ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అయితే  ఇవాళ మధ్యాహ్నం  రాజ్యసభలో  గిరిజన రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో   విజయసాయిరెడ్డి, టీడీపీ తరపున కనకమేడల రవీంద్రకుమార్  మాట్లాడారు.
 

 

   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios