సోషల్‌మీడియాలో ఫేక్ అకౌంట్లపై ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు

సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదివారం నాడు ఫిర్యాదు చేశారు. 

Ysrcp MP Vijayasai reddy complaints against fake accounts on social media


అమరావతి: సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదివారం నాడు ఫిర్యాదు చేశారు. 

సైబర్ క్రైమ్ చట్టం నుండి నిందితులు ఎవరూ కూడ తప్పించుకోలేరని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఫేక్ అకౌంట్లను సృష్టించి తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆయన చెప్పారు.

ఫేక్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసినట్టుగా ఆయన తెలిపారు. తనతో పాటు వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.

also read:ఏపీపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 50 కేసులు, మొత్తం 1980కి చేరిక

ఏపీ రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ క్యాడర్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకొన్నాయి. తమ పార్టీల వాదనను సమర్ధించుకొనేందుకు రెండు పార్టీలకు చెందిన నేతలు, క్యాడర్ మీడియాతో పాటు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని విమర్శలు చేసుకొంటున్నారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విజయసాయిరెడ్డి గుర్తించారు.నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని  ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios