ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు  నాయుడుపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. 'కండిషన్ అదుపు తప్పుతోంది. ఇక గొలుసులతో కట్టేయాల్సిందే.

 

మొన్న కరోనా వైరస్‌కు చికిత్స చేయడానికి ఇక్కడి డాక్టర్లకేం తెలుసని పేలాడు. జ్ఞానిని, నాకే అంతుబట్టడం లేదు స్టైరీన్ గ్యాసేమిటో, ఐఏఎస్ లకు ఏం తెలుసని అంటున్నాడు. బాధితుల ట్రీట్మెంటుకు బయటి నుంచి నిపుణులను రప్పించాలట!' అంటూ విజయసాయి రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

 

మరో ట్వీట్‌లో.. 'జనం జేబులు కొట్టడమే జీవిత లక్ష్యమైన బాబు జమానాలో  ప్రజల రక్తం స్ట్రా వేసుకు తాగిన జన్మభూమి కమిటీలు వికటాట్టహాసం చేస్తే-ప్రజాశ్రేయమే ప్రమాణమైన సీఎం జగన్ ఏలుబడిలో జనంకోసం రక్తం ధారవోయడానికీ వెనకాడని గ్రామ వాలంటీర్లు కథానాయకులవుతున్నారు! ఎంత తేడా!' అని ఆయన కొనియాడారు.

కాగా సోషల్ మీడియాతో  తనపై తప్పుడు వార్తలను పోస్ట్ చేస్తున్న వారిపై విజయసాయి సైబర్ క్రైమ్ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఫేక్ అకౌంట్లను సృష్టించి తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.