టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా బుధవారం వరుస ట్వీట్లతో బాబుపై విరుచుకుపడ్డారు.

ప్రతి దానికి కులానికి లింకుపెట్టే చంద్రబాబూ.. ఈ అంకెలు చూడు అర్థమవుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి కట్టుబడింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మాత్రమే. కులాలను రెచ్చగొట్టి, అహింసాగ్నిలో చలికాచుకునే చరిత్ర చంద్రబాబుదే..! బడ్జెట్లో కేటాయింపులో బీసీలకు 68.18 శాతం, కాపులకు 42.35 శాతం మైనార్టీలకు 116శాతం పెంపు' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

 

వెంటనే మరో ట్వీట్‌లో ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లు అచ్చెన్న బెదిరింపుల వల్ల రూల్స్‌కు విరుద్ధంగా కొనుగోలు చేస్తామని చెప్పారంట. వార్నింగులిచ్చి తప్పు చేయించాడని ఇన్‌సైడ్‌ స్టోరీలు బయటపెట్టారంట. వాళ్లు అప్రూవర్లుగా మారితే అచ్చెన్నకు శిక్ష తప్పదు. అచ్చెన్నే అప్రూవర్ అయితే పెదబాబు, చినబాబుల పరిస్థితి ఏమిటో? అంటూ విజయసాయి ధ్వజమెత్తారు.