వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి టీడీపీ నేత, స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై విరుచుకుపడ్డారు. స్పీకర్ పదవికి ఆయన కళంకం చేశారని.. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా లూటీ చేశారని విజయసాయి ఆరోపించారు.

ప్రజాధనం దోపిడీలో జులుం ప్రదర్శించి కోడెల స్పీకర్ పదవికే కళంకం తెచ్చారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీం, ఫార్మసీ కౌన్సిల్ ఆఫీసులను కనీస వసతులు కూడా లేని తన సొంత భవనంలో పెట్టించారు.

చ.అడుగుకు రూ.16 అద్దె. పైరవీ చేసుకుని రూ.25 తీసుకున్నారు. నాలుగున్నర కోట్ల పైనే లూటీ చేశారంటూ ట్వీట్ చేశారు. మరోవైపు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా తనను నియమించినందుకు పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు విజయసాయి ధన్యవాదాలు తెలిపారు.

అలాగే లోక్‌సభాపక్ష నేతగా నియమితులైన మిథున్ రెడ్డి, చీఫ్ విప్ మార్గాని భరత్‌కు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.