టీడీపీ అనుకూల మీడియాపై ట్విటర్‌ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ పోలవరం హెడ్ వర్క్స్ పనుల అంచనాలను గుట్టు చప్పుడు కాకుండా 1,750 కోట్ల మేరకు పెంచారని అను’కుల మీడియా గొల్లుమని శోకాలు పెట్టింది. కేంద్ర జల సంఘం డిజైన్లలో అదనపు పనులు చేర్పడం వల్ల కేంద్రం అనుమతి తోనే ఈ స్పల్ప పెంపు జరిగిందని మాత్రం ఎక్కడా ప్రస్తావించ లేదు. ఏడుపు బతుకులు ఇంతే’’ నంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

 

 

 

అంతకుముందు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా గ్రీటింగ్స్ తెలిపారు. ‘‘ ఏపీలో ఆఫీసులు మూసెయ్యడంతో పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420కి జన్మదిన శుభాకాంక్షలు. పైగా కరోనా వల్ల బర్త్ డే ఘనంగా చెయ్యవద్దంటూ సందేశం.17 తర్వాత 'పార్టీ లేదు బొక్కాలేదన్న సందేశాన్ని' ఇప్పటికే మీవాళ్లు పాటిస్తున్నారులే బాబు. మళ్ళీ నీ 'బ్రీఫ్ డు అవసరం లేదు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.