టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కృష్ణా నదీ జలాలతో పాటు టీడీపీ నేతల అరెస్ట్‌లపై ఆయన తనదైన శైలిలో స్పందించారు.

న‌దీ జ‌లాల విష‌యంలో గ‌తంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హ‌రించిన తీరుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణా వాదనను సమర్థించేలా టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్ర‌బాబు ఫిర్యాదు చేయించార‌ని ఆయ‌న ఆరోపించారు. 'రాయలసీమకు కృష్ణా జలాలు ఎలా తరలిస్తారన్న తెలంగాణ వాదనను సమర్థించేలా తన ఎమ్మెల్యేలతో ఫిర్యాదు చేయించిన చంద్రబాబు ఇప్పుడేం అంటాడో. కృష్ణా నదిపై ఉన్న అన్ని రిజర్వాయర్లు నిండి వందల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలవాలని కోరుకున్నట్టే కదా? ఈ రైతు ద్రోహి' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

ఆ వెంటనే మరో ట్వీట్‌లో టీడీపీ నేతల అరెస్ట్‌లపై విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ చట్టం చేతికి చిక్కిన తన దొంగల ముఠా సభ్యులను వెనకేసుకొస్తూ ప్రభుత్వంపై బాబు ఏమని పేలతాడో తెలియంది కాదు. కక్ష పూరిత అరెస్టు. అన్నీ రాసి పెట్టుకుంటున్నాం. మా ప్రభుత్వం రాగానే అంతకు అంత చూపిస్తామని చిటికెలేస్తాడు. పరామర్శల పేరుతో లోకేశం విందు భోజనాలు ఆరగించి వస్తాడు’’ అంటూ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…