అనంతపురం: అనంతపురం ఎంపీ తలారి రంగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో చంపేవాడు, చచ్చేవాడు బోయవాడేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.చంపడానికి ఉసిగొల్పేవాళ్ల  తలతీసెయ్యాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉసిగొల్పేవాడి తలతీసేస్తే మనం తన్నుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. 

దెబ్బలతో డాక్టర్లకు దగ్గరకకు మనం వెళ్లడం కాదు మనమే డాక్టర్లం కావాలంటూ చెప్పుకొచ్చారు. బోయలు బోనులో నిలబడం కాదని తీర్పులు చెప్పే న్యాయమూర్తులుగా ఎదగాలను సూచించారు. 

వైసీపీ ఎంపీ తలారి రంగయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయం రూపుమాపిందనకుంటున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై రాజకీయంగా చర్చ జరుగుతుంది.