సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాను వీక్షించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.  అందరూ ఈ సినిమాను ఖచ్చితంగా చూడాలని.. రజనీ చరిష్మా, స్వాగ్ అద్భుతమని రఘురామ ప్రశంసించారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాను వీక్షించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. అనంతరం సినిమా ఎలా వుందో చెబుతూ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో గతంలో రజనీపై విమర్శలు చేసిన వైసీపీ నేతలకు చురకలంటించారు. ‘రజనీకాంత్ గారు, మిమ్మల్ని విమర్శించిన వాళ్లకి ఇప్పుడు “అర్థమైంది రాజా”. అంటూ ట్వీట్ చేశారు.

ఇటీవలికాలంలో తాను చూసిన అత్యుత్తమ సినిమాల్లో జైలర్ ఒకటి అన్నారు. అందరూ ఈ సినిమాను ఖచ్చితంగా చూడాలని.. రజనీ చరిష్మా, స్వాగ్ అద్భుతమని రఘురామ ప్రశంసించారు. డైరెక్టర్ నెల్సన్ ప్రతీ సిన్‌ను అద్భుతంగా చిత్రీకరించారని, సంగీత దర్శకుడు అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని.. జైలర్ సినిమా ఎన్నో రికార్డులను బద్ధలు కొడుతుందని రఘురామ ఆశాభావం వ్యక్తం చేశారు. 

కాగా.. కొద్దిరోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. సాధారణంగా రజినీకాంత్ చాలా కూల్‌గా కనిపిస్తుంటారు. ఆయన నటనతో పాటు, వ్యక్తిత్వానికి కూడా భారీగా అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ అభిమానుల జాబితాలో ఎంతో మంది సినీ తారలు కూడా ఉంటారు. అయితే తాజాగా జైలర్ ఆడియో విడుదల వేడుక సందర్భంగా తన విమర్శకు గట్టి కౌంటర్లే ఇచ్చారు. ఈ మాటలు ఆయన అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి. భాషతో సంబంధం లేకుండా ఆయన మాట్లాడిన మాటలు, పలికించిన ఎక్స్‌ప్రెషన్స్ చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ALso Read: మొరగని కుక్క, విమర్శించని నోరు లేదు.. ‘‘అర్ధమైందా రాజా’’: రజనీకాంత్ సంచలనం.. టార్గెట్ వైసీపీనేనా? (వీడియో)

అయితే రజనీకాంత్ ఆ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై మాత్రం రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ ప్రసంగం చివరిలో ‘‘అర్ధమైందా రాజా’’ అని చెప్పడం ద్వారా ఇటీవల ఆయనపై విమర్శలు చేసిన వైసీపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారా? అనే చర్చ కూడా సాగుతుంది. 

ఇంతకీ రజనీకాంత్ ఏమన్నారంటే.. ‘‘మొరగని కుక్కలేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ జరగని ఊరే లేదు. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి’’ అని తమిళంలో చెప్పారు. చివరిలో తెలుగులో ‘‘అర్థమైందా రాజా?’’ అని అన్నారు. రజనీకాంత్ ఈ డైలాగ్ చెప్పగానే.. ఆడిటోరియం మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లింది. ఈ వేడుకకు హాజరైన రజనీకాంత్ కుటుంబ సభ్యులు, సినీ నటి రమ్యకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా నవ్వుతూ కనిపించారు. 

అయితే కొన్నినెలల కింద విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గొప్పతనం, తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే చంద్రబాబును రజనీకాంత్ ప్రశంసించడాన్ని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనీకాంత్‌పై ఓ రేంజ్‌లో ఎదురుదాడికి దిగారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సినీ నటి రోజా కూడా ఘాటుగానే స్పందించారు. కొడాలి నాని అయితే.. రజనీకాంత్‌పై తనదైన శైలిలో రెచ్చిపోయి మాట్లాడారు. 

Scroll to load tweet…