మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి సత్యనారాయణమ్మ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని పెద్ద కుమారుడి వద్ద ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

అయితే, శనివారం రాత్రి నిద్రలోనే ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో చనిపోయారు. దీనిని గమనించిన కుటుంబసభ్యుల ఆమెను వైద్యం కోసం కిమ్స్‌కు తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు తేల్చారు.

సత్యనారాయణమ్మ ఆకాలమరణంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఈ మరణ వార్త తెలుసుకున్న పిల్లి అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున రామచంద్రాపురంలోని ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.

సత్యనారాయణమ్మ భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామం హసనాబాద్‌కు తరలిస్తున్నారు. సోమవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.