లోక్ సభలో స్పీకర్ పదవిలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూర్చున్నారు.  రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం జరిగిన సమావేశాల్లో ప్యానల్‌ స్పీకర్‌గా వ్యవహరించారు.

లోక్ సభలో స్పీకర్ పదవిలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూర్చున్నారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం జరిగిన సమావేశాల్లో ప్యానల్‌ స్పీకర్‌గా వ్యవహరించారు. ప్యానల్‌ స్పీకర్‌గా మూడు రోజుల క్రితం నియమితుడైన ఆయన గురువారం మధ్యాహ్నం స్పీకర్‌ ఓం బిర్లా హాజరుకాకపోవడంతో ప్యానల్‌ స్పీకర్‌ బాధ్యతలను నిర్వర్తించారు.స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ లేని సమయాల్లో ప్యానల్‌ స్పీకర్‌ సభను నిర్వహించాల్సి ఉంటుంది.

ప్రస్తుత లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్‌ నియామకం జరగకపోవడంతో ప్యానల్‌ స్పీకర్‌గా మిథున్‌రెడ్డి ఆధార్‌ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభకు అధ్యక్షత వహించి ఇంగ్లీష్‌, హిందీలో మాట్లాడుతూ సభను నడిపారు. కడప జిల్లా నుంచి స్పీకర్‌ కుర్చీపై ఆశీనులైన వారిలో మిథున్‌రెడ్డి రెండో వ్యక్తి. 1952లో ఏర్పడిన తొలి లోక్‌సభలో జిల్లాకు చెందిన మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


1956 నుంచి 1962 వరకు ఆయన స్పీకర్‌గానూ వ్యవహరించారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1967 నుంచి 1969 వరకు , 1977 మార్చి నుంచి జూలై నెల వరకు రెండు పర్యాయాలు నీలం సంజీవరెడ్డి, 1998 నుంచి 2002 వరకు ఎన్డీయే పాలనలో జీఎంసీ బాలయోగి స్పీకర్‌ పదవిని అధిష్ఠించారు. అనంతరం 17 సంవత్సరాల తరువాత తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి మరో మారు స్పీకర్‌ చైౖర్‌పై కూర్చొనే అవకాశం దక్కింది.