Asianet News TeluguAsianet News Telugu

వాల్తేరుతో కూడిన రైల్వే జోన్ కావాలి: రైల్వేజీఎంతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

కొత్త రైళ్లు, కొత్త రైల్వే లైన్లపై కూడా చర్చించినట్లు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అటు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ సైతం వాల్తేరుతో కూడిన విశాఖపట్నం రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. 

Ysrcp mp midhun reddy met railway gm, discuss on visakha railway zone
Author
Vijayawada, First Published Sep 24, 2019, 3:26 PM IST

విజయవాడ: వాల్తేరుతో కూడిన విశాఖపట్నం రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేశారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. విశాఖపట్నం రైల్వేజోన్ ప్రకటించి దాని నుంచి వాల్తేరు డివిజన్ ను తప్పించడం సరికాదన్నారు. 

విజయవాడలో రైల్వే జీఎంతో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో అభివృద్ధి పనులపై ఏకరువు పెట్టారు ఎంపీలు. వాల్తేరుతో కూడిన విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

అలాగే అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీల అమలు చేయాలని, పెండింగ్ నిధులు కూడా విడుదల చేయాలని కోరారు. 

కొత్త రైళ్లు, కొత్త రైల్వే లైన్లపై కూడా చర్చించినట్లు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అటు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ సైతం వాల్తేరుతో కూడిన విశాఖపట్నం రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. 

మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని రైల్వే జీఎంతో భేటీని బాయ్ కాట్ చేశారు. ప్రతీ ఏడాది సమావేశాలు జరుగుతున్నాయే కానీ తాము చేసిన డిమాండ్లను పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ సమావేశాన్ని బహిష్కరించిన సంగతి తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

రైల్వే అధికారులపై ఎంపీ కేశినేని ఫైర్: రైల్వే జీఎం సమావేశం బాయ్ కాట్

Follow Us:
Download App:
  • android
  • ios