న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆంధప్రదేశ్ రాష్ట్రాన్ని సత్వరమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్. నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని పెద్దన్న పాత్ర పోషించి ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న తమ్ముడిని అన్నయ్య ఎలా ఆదుకుంటాడో అలానే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెద్దన్నలా పెద్దమనసుతో ఆదుకోవాలని లోక్ సభలో ఎంపీ మార్గాని భరత్ కోరారు.