అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. 

రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు తాను చేసిన తప్పులకు భయపడే ఇతర పార్టీల నాయకుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు మతి భ్రమించిందన్నారు. 

అందువల్లే ప్రజా తీర్పును చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. మే 23 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీలో రాజన్న రాజ్యం రావడం తథ్యమన్నారు మార్గాని భరత్. 
 

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి