Asianet News TeluguAsianet News Telugu

దేవినేని ఉమా... సిగ్గు లేనిది నాకా లేక నీకా?: ఎమ్మెల్యే వసంత ఫైర్ (వీడియో)

మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్ర విమర్శలు చేసారు. 

YSRCP MLA Vasantha Krishnaprasad Fires on Devineni Uma AKP
Author
First Published May 31, 2023, 2:09 PM IST

విజయవాడ : మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య మాటలయుద్దం కొనసాగుతోంది. దీంతో మైలవరం నియోజకవర్గంలో పాలిటిక్స్ హాట్ హాట్ సాగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైన మైలవరంలో గెలవాలని భావిస్తున్న ఇరువురు నాయకులు నిత్యం ప్రజల్లో వుంటూ ఒకరిపపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇలా తాజాగా ఉమ తనపై చేసిన కామెంట్స్ కు ఘాటుగా కౌంటరిచ్చారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. 

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో రక్షిత మంచినీటి పథకం పనులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భూమి పూజ చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...  గొల్లపూడి గ్రామానికి మంచినీటి సమస్య వుందని ఇప్పుడు నీకు కొత్తగా గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించారు. టిడిపి అధికారంలో వుండగా మంత్రి పదవిలో వుండికూడా ఉమకు గొల్లపూడిలో నీటిసమస్య గుర్తుకురాలేదు... కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల నోటిపికేషన్ కు పదిరోజుల ముందు గుర్తుకువచ్చిందని అన్నారు. ఓట్ల కోసమే మంచినీరు అందిస్తానని శంకుస్థాపన చేసినా ప్రజలు అతన్న నమ్మలేదని వసంత పేర్కొన్నారు. 

వీడియో

ప్రతి ఒకరికీ మంచినీరు అందించి దాహార్తిని తీర్చాలని నేను... ఓట్ల కోసం ప్రజల్ని నమ్మించి మోసంచేసింది నువ్వు... మరి సిగ్గులేనిది నాకా లేదా నీకా? అని ఉమను నిలదీసారు ఎమ్మెల్యే వసంత. పదేళ్లు మంత్రిగా పనిచేసి కూడా ఏ గ్రామాల్లో ఏ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసాడో కూడా ఆయనకు తెలియదని అన్నారు. వెనకాల వున్నవారు చెబుతుంటూ ఈయన మాటడుతుంటాడని వసంత కృష్ణప్రసాద్ ఎద్దేవా చేసారు. 

Read More  ఏపీ అసెంబ్లీ ఎన్నికలు .. గుడివాడలో వంగవీటి రాధా పోటీ చేయడు : కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

భూమిపై జీవించే ప్రతిజీవికి తాగునీరు అవసరమని... అలాంటిది ఈ విషయంలోనూ రాజకీయాలు చేయడం తగదని ఎమ్మెల్యే అన్నారు. తాగునీటిని కూడా కులాలు, మతాలు, వర్గాలకు అపాదించడం ఉమాకే చెల్లిందన్నారు. ప్రజలకు తాగు నీరు అవసరం... ఇందులో కులాల ప్రస్తావన అవసరం లేదంటూ దేవినేని ఉమకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చురకలు అంటించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios