ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే వంశీపై టీడీపీ నేతలు విమర్శలు చేశారంటూ.. అతని అనుచరులు, స్థానిక టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. కొందరు కార్యకర్తలు రాళ్లు రువ్వడం, ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి చేజారింది. ఈ క్రమంలో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కారును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. తాజా పరిస్థితులపై స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే వంశీపై టీడీపీ నేతలు విమర్శలు చేశారంటూ.. అతని అనుచరులు స్థానిక టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. కొందరు కార్యకర్తలు రాళ్లు రువ్వడం, ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి చేజారింది. ఈ క్రమంలో టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కారును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా.. ఎమ్మెల్యే వంశీపై విమర్శలు చేసిన దొంతు చిన్నా కారుకు నిప్పుపెట్టారు.
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నేతలు పార్టీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. గన్నవరం రాకుండా.. టీపీడీ నేతలకు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే కారణమని టీడీపీ నేతల ఆరోపణలు చేస్తోంది. ఎమ్మెల్యే అండదండలతోనే తమ కార్యాలయంపై దాడులు చేశారని, వైసీపీ గుండాలపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే వైసీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీడీపీ (తెలుగుదేశం)నాయకులు హెచ్చరించారు. గన్నవరం పోలీస్ స్టేషన్ ముందు పట్టాభి సహా పలువురు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. గన్నవరం వారు కాకుండా.. బయటి వాళ్లు వచ్చి ఇక్కడ (గన్నవరం) గొడవ చేశారని, కానీ.. కేవలం తన అనుచరులే.. దాడికి పాల్పడ్డారని ఓ వర్గం ప్రచారం చేస్తోందని అన్నారు. అయినా.. బయటివాళ్లు ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిన అవసరమేంటని నిలదీశారు. గన్నవరంలో జరిగే ప్రతి సంఘటనతో తనకేంటి సంబంధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు తిడుతున్నారనీ, అలా చేస్తే ఎవరూ ఊరుకోరని అన్నారు. సంకల్ప సిద్ధికి తనకు ఎలాంటి సంబంధం లేదని, న్యాయం తనవైపే ఉందని స్పష్టం చేశారు. కోర్టులో పరువు నష్టం దావా వేశాను అన్నారు. చేతనైతే గన్నవరంలో తనపై పోటీ చేసి గెలువాలని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.టీడీపీ కుక్కలు తిడుతుంటే ఊరుకుంటామా? దమ్ముంటే రండి చూసుకుందాం అని, తాను గన్నవరంలో పార్టీ ఆఫీసులోనే ఉన్నానని ఓపెన్ చాలెంజ్ కూడా చేశారు.
తనకు, కొడాలి నానికి చంద్రబాబు చరిత్ర మొత్తం తెలుసని, ఆయనకు ప్రజల కంటే ఎక్కువగా మీడియాను, సోషల్ మీడియాను నమ్ముకుంటాడని విమర్శించారు. గుడ్డకాల్చి ముఖం వేయడంలో చంద్రబాబుకు చాలా అనుబంధముందని అన్నారు. అందుకే తన పార్టీ కార్యకర్తలను, తమపై ఉసిగొల్పుతున్నాడని వంశీ మండిపడ్డారు.
తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, మామూలు విషయాలకు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రజల కంటే కొడాలి నాని, తాను కూడా చేతులు కట్టుకుని ఏమీ లేమని, తాము కూడా.. అదే పార్టీ నుంచి వచ్చిన వాళ్లమేనని వంశీ హెచ్చరించారు. అలాగే కొడాలి నానిని గడ్డం గ్యాంగ్ అని తిడుతున్నారు. తనను సైతం సైకో అంటున్నారని.. ఇలా తిట్లు తిట్టడం కాదు.. చేతనైతే తన మీద పోటీ చేసి తనను ఓడించండి అని సవాల్ విసిరారు.
