చంద్రబాబే దొంగతనం చేసి ఎదుటి వారిని దొంగ అనే రకమన్నారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ ఆర్‌కే రోజా. టీడీపీ హయాంలోనే తిరుపతి వెయ్యి కాల్ల మండపం కూల్చారని ఆమె ఆరోపించారు.

విజయవాడలో ఆలయాలను కూల్చిన వ్యక్తి చంద్రబాబని... ఆయన కూల్చిన ఆలయాలను కట్టిస్తానంటున్న వ్యక్తి జగన్ అని రోజా ప్రశంసించారు. కాగా, నిన్న మీడియాతో మాట్లాడిన ఆమె.. తన హయాంలో ఆలయాలు కూల్చినందుకే చంద్రబాబు నేడు ఇంతగా పతనం అయ్యారని విమర్శించారు. ఇ

ప్పుడు దేవుళ్లతో రాజకీయం చేస్తున్నారని, ఆయన మరింత పతనం కావడం తథ్యమని రోజా హెచ్చరించారు. అయ్యప్పమాల వేస్తే మద్యం ఆదాయం తగ్గిపోతుందన్న వ్యక్తి చంద్రబాబు అని రోజా వ్యాఖ్యానించారు.

డీజీపీ మతం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు, తన హయాంలో సీపీగా నియమించుకోలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడున్న అధికారులంతా చంద్రబాబు హయాంలోనివారేనని, సీఎం జగనేమీ కొత్తగా తీసుకురాలేదని రోజా వివరించారు.