గుంటూరు: పల్నాడులో ప్రశాంత పరిస్థితులను చెదరగొట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

మాచర్లలో బుధవారం నాడు టీడీపీ నేతలు బొండా ఉమ మహేశ్వరరావు,  బుద్దా వెంకన్నలు ప్రయాణీస్తున్న కారుపై దాడి ఘటనకు సంబంధించి  ఆయన స్పందించారు.

Also read:చంపేస్తారా, డీజీపీ సమాధానం చెప్పాలి: మాచర్ల ఘటనపై బాబు ఆగ్రహం

విజయవాడ నుండి బుద్దా వెంకన్న, బొండా ఉమలతో పాటు గూండాలను చంద్రబాబు నాయుడు పంపించారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. పది కార్లలో విజయవాడ నుండి వచ్చిన టీడీపీ నేతలు  మాచర్ల వస్తున్న సమయంలో ఓ పిల్లాడిని టీడీపీ నేతల కారు ఢీకొట్టిందన్నారు. ఈ విషయమై గ్రామస్తులపై టీడీపీ నేతలు దుర్భాషలాడారని ఆయన చెప్పారు. 

దీంతో స్థానికులు టీడీపీ నేతల కారుపై దాడి చేశారని ఆయన వివరించారు.రైతుల ముసుగులో తనపై గతంలో దాడి చేశారని ఆయన ప్రశ్నించారు.