Asianet News TeluguAsianet News Telugu

సొంత ప్రభుత్వం, అధికారులపై విమర్శలు : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తాడేపల్లి నుంచి పిలుపు..రేపు జగన్‌తో భేటీ

గత కొంతకాలంగా సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా ఆయనకు తాడేపల్లి నుంచి పిలుపొచ్చింది. దీంతో సోమవారం ముఖ్యమంత్రి జగన్‌తో శ్రీధర్ భేటీకానున్నారు. 

ysrcp mla kotamreddy sridhar reddy to meet ap cm ys jagan on tomorrow
Author
First Published Jan 1, 2023, 6:30 PM IST

నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సీఎం జగన్ నుంచి పిలుపువచ్చింది. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రితో కోటంరెడ్డి భేటీకానున్నారు. ఇటీవల అధికారుల తీరుపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు శ్రీధర్ రెడ్డి. 

కాగా.. గత నెల 23న అధికారులతో సమీక్ష సందర్భంగా  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సౌత్ మోపూరులోని మొగిలిపాలెం వద్ద సవిటి వాగు తెగిపోయి దాదాపు 150 ఎకరాల వరకు పంట పొలాలు నీటమునిగాయి. అధికారుల వైఖరి కారణంగానే ఇలా జరిగిందంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు చేశారు. పై నుంచి ఎంత వరద వస్తుందో తెలియదా అంటూ ఇరిగేషన్ అధికారులను కడిగిపారేశారు.

ALso REad: ఎల్లకాలం పల్లకి మోయడమేనా.. మేం కూర్చొవద్దా : ఎమ్మెల్సీ ఇక్బాల్‌పై వైసీపీ నేత నవీన్ నిశ్చల్ వ్యాఖ్యలు

మంత్రులు మారినా పనులు జరగడం లేదంటూ శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. బొత్స మున్సిపల్ శాఖ మంత్రిగా వున్నప్పుడు హామీ ఇచ్చిన పనులు ఇంకా మొదలు కాలేదని ఆయన దుయ్యబట్టారు. నెల్లూరు నగరంలోని కొత్త రోడ్ల నిర్మాణంపైనా కోటంరెడ్డి అధికారులపై మండిపడ్డారు. పొట్టేపాలెం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని.. దీనిపై అధికారుల్ని అడిగితే సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఇదంతా చూసి జనం ఇదేం ఖర్మ అనుకుంటున్నారంటూ మంత్రి కాకాణి ముందే కోటంరెడ్డి శ్రీధన్ రెడ్డి అధికారులకు క్లాస్ పీకారు. 

ALso REad: జనం ఇదేం ఖర్మ అనుకుంటున్నారు.. అధికారులపై కోటంరెడ్డి ఆగ్రహం, మంత్రి కాకాణి ముందే

ఇదిలావుండగా.. ఈ ఏడాది జూలైలోనూ  రైల్వే, మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మురుగునీటి కాలువలోకి దిగి కలకలం రేపారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా మురుగు నీరు వచ్చి చేరుతోంది అని కోటంరెడ్డి తెలిపారు. ఈ సమస్య అనేక సంవత్సరాలుగా ఉందని, దీని మీద ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు ప్రశ్నించానని అన్నారు. రైల్వే, కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకున్నారని వెల్లడించారు.  

తాను అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నుంచి కూడా.. అధికారులతో మాట్లాడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికారమా? ప్రతిపక్షమా?  అనేది ఉండదని..  ప్రజల పక్షమే ఉంటుందని అన్నారు. తాను ఆ పక్షమే ఉంటానని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తాను కూడా బాధపడుతున్నానని అన్నారు. రైల్వే అధికారుల మొండి తీరు, కార్పొరేషన్ అధికారులు నత్తనడకని ప్రశ్నిస్తూ మురుగు గుంతలోకి దిగుతున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios